Posts

Showing posts from October, 2015

అమరావతి...

అమరావతి... మా ఆశయం, మా ఆరాటం.. అమరావతి! మా స్వప్నం, మా శౌర్యం.. అమరావతి! మా లక్ష్యం, మా కష్టం.. అమరావతి! మా గమనం, మా గమ్యం.. అమరావతి! మా రుధిరం, మా రౌద్రం.. అమరావతి! మా సైన్యం, మా సాధనం.. అమరావతి! మా బ్రతుకు, మా భవిత.. అమరావతి! మా పొగరు, మా పోరు.. అమరావతి! మా ఉషస్సు, మా తపస్సు.. అమరావతి! మా ఊహ, మా ఊపిరి.. అమరావతి! మా శక్తి, మా స్పూర్తి.. అమరావతి! మా తేజం, మా త్యాగం.. అమరావతి! మా సంకల్పం దుర్భేధ్యం.. మా దూకుడు అనితరసాధ్యం. ఇంద్రుని కొలువు అమరావతి! ఆంధ్రుల నెలవు అమరావతి! దేవనగరం అమరావతి! ఆంధ్ర మకుటం అమరావతి! ఘన చరిత్ర అమరావతి! ఆంధ్ర గరిమ అమరావతి! అమరావతి! అమరావతి! అమరావతి!